Friday, 11 March 2011

అమ్మాయిని ఆకర్షించడం ఎలా?


తనింటి ముందు కొత్తగా అద్దే ఇంట్లోకొచ్చిన సుకంన్యను చూసి ప్రసాద్ మనసు ప్రేమించాలనే చిత్ర విచిత్రమైన కోరిక కలిగింది. రేండునెలలు తన చూపులతో సుకంన్యను మింగేసేలా చూసే వాడు, కానీ సుకన్య నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇలా కుదరదని ఏదో వకటి చేసి సుకన్య ను ప్రేమలో పడగొట్టాలని అనుకున్నాడు ప్రసాద్. "అమ్మాయిని ఆకర్షించడం ఎలా?" అనే పుస్తకం కొని దానిలోని చిట్కాలన్నీ ఉపయోగించాడు, కానీ సుకన్య నుండి ఎలాంటి స్పందన రాలేదు. ప్రసాద్ సహనం నశించింది, సుకన్య ఇంటికి వెళ్లి తాడో పేడో తెల్చుకోవాలనుకున్నాడు ప్రసాద్. ఆ రోజే సుకన్య ఇంటికి వేల్యాడు ప్రసాద్, ఇంటిలోపల హాల్ లో ఎవరు కనిపించ లేదు. బల్ల మిద ఓ పుస్తకం కనిపించింది, ప్రసాద్ ఆ పుస్తకం మిద ఉన్నా శర్షిక చూసి తల జుట్టు పికొంటు అక్కడినుండి వెళ్లిపోయాడు. ఇంతకీ ఆ పుస్తకం ఎంటి ? " అబ్బాయిల ఆకర్షననుండి తప్పించుకోవడం ఎలా? " అబ్బాయి గారు , అమ్మాయి గారు , దయచేసి ఈ జోక్ మిద మీ అభిప్రాయాలూ వ్రాయండి .

No comments:

Post a Comment