ఆడుకళమ్ – కోడిపందెం
కోడిపందాల నేపధ్యంలో ఇంత గొప్పగా ఒక సినిమా తియ్యొచ్చని దర్శకుడు వెట్రిమారన్ నిరూపించాడు.
కోడిపందాల చిత్రీకరణలో వాడిన గ్రాఫిక్ మహేంద్రజాలం ఎంత సహజంగా ఉందంటే, ఎనిమల్ రైట్స్ యాక్టివిస్టులు కేస్ వేసినా వేసేంత సహజంగా.
ధనుష్ పాత్రకు సరిపోతే, తాప్సీ ఆంగ్లోయిండిన్ గా చాలా అందంగా ఉంది. నటనలో హైయ్యెస్ట్ మార్క్స్ మాత్రం ‘పెట్టై కారన్’ గా చేసిన జయబాలన్ కు దక్కుతుంది.
ద్వితీయార్థంలో కొంచెం హింసపాళ్ళు ఎక్కువేగానీ…తప్పకుండా చూడాల్సిన చిత్రం. DON’T MISS IT.
సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో ఇదే సూపర్ హిట్. తమిళ సినిమా, తమిళ ప్రేక్షకులు…మీకు జేజేలు !
PS: ఈ సినిమా హక్కులు తెలుగులో కొనే ప్రయత్నాలు చేస్తున్నారని విన్నాను…వారికి నా విన్నపం ఒకటే, బాబులూ! తమిళంలో చేసిన కోడిపందేల సినిమా హక్కులు కోట్లు పోసి ఎందుకు కొనడం? మన ఆంధ్రాలో జరిగే కోట్లరూపాయల సంక్రాంత్రి కోడిపందేల నేపధ్యంలో కాస్త రీసెర్చ్ చేస్తే బోలెడు కథలు పుడతాయి (ఇప్పటికే ఉన్నాయి) మీరు తమిళ హక్కులకు పెట్టేదానిలో సగం, పోనీ పావువంతు ఖర్చు పెట్టండి, అచ్చమైన తెలుగు కోడిపందేల కథలు ఇస్తాం…ఈ మాటా వినకపోతే చేసేదేమీ లేదు.
No comments:
Post a Comment